అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పులు తీర్చే మార్గం లేక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన రైతు గొట్టేకర్ సూర్యభాన్ (55) పు రుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
జైనూర్, నవంబర్ 2 : అప్పులు తీర్చే మార్గం లేక కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన రైతు గొట్టేకర్ సూర్యభాన్ (55) పు రుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం. సూర్యభాన్కు బూసిమెట్ట క్యాంప్‌లో మూడెకరాలుండగా, జామ్ని గ్రామం లో ఏడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి తదితర పంటలు సాగు చేశాడు.
పెట్టుబడి కోసం రెండున్నర లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు పడకపోవడంతో దిగుబడి ప్రభావం పడింది. దీంతో పెట్టుబడులైనా వస్తాయో లేదోనని మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో సోమవారం పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవికుమార్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

