20 ఫీట్ల నిబంధనలపై నేడు నిరసన
చిన్న, సన్నకారు బిల్డర్లు, పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి నిర్మాణాలను దెబ్బతీస్తున్న జీవో నెం. 168కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మహాధర్నాకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కోరారు.
- తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్
సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : చిన్న, సన్నకారు బిల్డర్లు, పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి నిర్మాణాలను దెబ్బతీస్తున్న జీవో నెం. 168కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న మహాధర్నాకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కోరారు. కొందరు బడా వ్యాపారుల అక్రమాలను వదలిపెట్టి, లక్షలాది మందిగా ఉన్న చిన్న, సన్నకారు బిల్డర్లను వ్యాపారాలను దెబ్బతీసేలా సర్కార్ వ్యవహరిస్తున్నదని, ఈ క్రమంలో ఇంటి ఫేసింగ్ 20 ఫీట్ల కంటే తక్కువ ఉంటే అనుమతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో బిల్డ్ నౌలో ఉన్న సాంకేతిక పరమైన అడ్డంకిని తక్షణమే తొలగించి, 20 ఫీట్ల కంటే తక్కువ వెడల్పుతో ఉండే ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలని సర్కార్ను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని నేడు(మంగళవారం) ముట్టడించి, శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఈ క్రమంలో గ్రేటర్లో పరిధిలోని బాధితులు, బిల్డర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

