నేడు మరో రూ.3,000 కోట్లు
రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం (నవంబర్ 3న) నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రూ.3 వేల కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టినట్టు తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు రూ.53,900 కోట్లకు చేరుకుంటాయి.
- ఇప్పటికే రూ.50,900 కోట్ల అప్పులు.. రుణాల వేటలో రేవంత్రెడ్డి సరార్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం (నవంబర్ 3న) నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా మరో రూ.3 వేల కోట్ల రుణ సమీకరణకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టినట్టు తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు రూ.53,900 కోట్లకు చేరుకుంటాయి.
అంటే రాష్ట్ర వార్షిక రుణ లక్ష్యం రూ.61,457.16 కోట్లలో 87.70 శాతానికిపైగా వినియోగించినట్టు అవుతుంది. దీంతో వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.7,557.16 కోట్ల రుణాలనే తీసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్రెడ్డి సర్కార్.. రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో ఏకంగా రూ.27,500 కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యంలో కేవలం 7 నెలలకే 87 శాతానికిపైగా రుణాలను వినియోగించడం మన ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

