21న పాస్పోర్ట్ మేళా
పాస్పోర్ట్ సేవల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ప్రత్యేక అవకాశం కల్పించింది. పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య, అపాయింట్మెంట్ల కోసం నెలకొన్న నిరీక్షణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా పాస్పోర్ట్ మేళా నిర్వహించాలని నిర్ణయించింది.
సిటీబ్యూరో: పాస్పోర్ట్ సేవల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ప్రత్యేక అవకాశం కల్పించింది. పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య, అపాయింట్మెంట్ల కోసం నెలకొన్న నిరీక్షణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా పాస్పోర్ట్ మేళా నిర్వహించాలని నిర్ణయించింది. ఈనెల 21న నగరంలో ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి మాదవ్ రచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో భాగంగా సాధారణ పాస్పోర్ట్, తతాల్ పాస్పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సేవలకు సంబంధించి సుమారు 4 వేల అపాయింట్మెంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
ఈ అపాయింట్మెంట్లను నవంబర్ 3 నుంచి విడుదల చేస్తామని వివరించారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలోని అన్ని పాస్పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల(పీఓపీఎస్ కే) పరిధిలో ఈ అపాయింట్ మెంట్లు అందుబాటులో ఉంటాయన్నారు. పాస్పోర్ట్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడంతో పాటు దరఖాస్తుదారులకు నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే ఈ ప్రత్యేక మేళా లక్ష్యమని ఆర్పీఓ వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

