హైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన పూన ప్రదీప్‌కుమార్ రావి ఆకులపై అద్భుత కళారూపాలు సృష్టిస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నాడు. తాజాగా.. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకల వేళ రావి ఆకుపై రామానుజస్వామి, చినజీయర్‌స్వామి ఆకృతులు రూపొందించాడు. గతంలో సీఎం కేసీఆర్‌తోపాటు మరెందరో మహనీయుల రూపాలనూ చిత్రీకరించాడు. స్వర్ణకారుడైన ప్రదీప్‌కుమార్ ఖాళీ సమయాల్లో తన కళలతో పలువురి మన్ననలు పొందుతున్నాడు.