ఆ రోజు కోసం నిరీక్షిస్తున్నా!
కాస్త అమాయకత్వం కలబోసిన ప్రసన్న వదనం, చూడగానే ఇట్టే ఆకట్టుకునే చక్కటి రూపలావణ్యం, నాజూకు సొగసుల మెరుపులతో కుర్రకారులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మరాఠీ అందాలరాశి భాగ్యశ్రీ బోర్సే. ‘మిస్టర్ బచ్చన్'తో తెలుగులో అరంగేట్రం చేసి ఆపై కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది.
కాస్త అమాయకత్వం కలబోసిన ప్రసన్న వదనం, చూడగానే ఇట్టే ఆకట్టుకునే చక్కటి రూపలావణ్యం, నాజూకు సొగసుల మెరుపులతో కుర్రకారులో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మరాఠీ అందాలరాశి భాగ్యశ్రీ బోర్సే. ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగులో అరంగేట్రం చేసి ఆపై కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తాజా చిత్రం ‘లెనిన్’తో ఈ భామ కెరీర్లో తొలి విజయాన్ని అందుకుంది. ఇందులో ఆమె పోషించిన భారతి పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం భాగ్యశ్రీబోర్సే పాత్రికేయులతో తన ఆనందాన్ని పంచుకుంటూ చెప్పిన సంగతులివి..
- ‘లెనిన్’ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రతీ ఒక్కరూ సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. భారతి పాత్రలో నా నటన బాగుందని చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సినిమా విషయంలో మా టీమ్ అంచనాలన్నీ నిజమయ్యాయి. అందుకే ఈ సక్సెస్ ఎమోషనల్‌గా అనిపిస్తున్నది.
- ‘హైదరాబాద్ నా కర్మభూమి, ఇక్కడే చివరి చిత్రాన్ని చేస్తాను’ అని ఇటీవల సక్సెస్‌మీట్‌లో చెప్పాను. తెలుగు ప్రేక్షకులు నన్ను సొంత అమ్మాయిలా ఆదరించారు. నా సినీ ప్రయాణం హైదరాబాద్ నుంచే మొదలైంది. అందుకే ఈ నగరంతో, తెలుగు సినిమాతో జీవితాంతం అనుబంధం కొనసాగించాలనుకుంటున్నాను.
- ‘లెనిన్’ కథ చెప్పినప్పుడే హృదయాన్ని కదిలించింది. నటనకు అవకాశం ఉన్న మంచి పాత్ర అని అప్పుడే అర్థమైంది. ఇప్పుడు భారతి పాత్రను ప్రేక్షకులు అభిమానించడం ఆనందంగా ఉంది. ఈ పాత్ర నా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇకపై మంచి కథలు, పాత్రలు ఎంచుకోవాలనే బాధ్యతను ఈ సినిమా గుర్తుచేసింది. అన్నింటికంటే ముఖ్యంగా నాగార్జునగారు వేదికపై నా నటనను మెచ్చుకోవడం చాలా సంతోషంగా అనిపించింది.
- భవిష్యత్తులో లార్జర్ దేన్ లైఫ్ సినిమాల్లో మహారాణి, యువరాణి పాత్రలు చేయాలనుంది. అలాంటి సినిమాల్లో రాజమౌళిగారు మాస్టర్. ఎప్పుడో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలన్నది నా కోరిక. అది తీరే రోజు కోసం వేచిచూస్తున్నా. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో సినిమా చేస్తున్నా. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

