కరోనాతో ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ మృతి
కరోనాతో ఢిల్లీ సఫ్దర్‌జంగ్ సీనియర్ డాక్టర్ మృతి | రెండు నెలలుగా ఐసీయూలో కరోనాతో పోరాడుతూ ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు, ఆర్థోపెడిక్ సర్జన్ రమేశ్‌కుమార్ కన్నుమూశారు.

న్యూఢిల్లీ : రెండు నెలలుగా ఐసీయూలో కరోనాతో పోరాడుతూ ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు, ఆర్థోపెడిక్ సర్జన్ రమేశ్‌కుమార్ కన్నుమూశారు. దేశంలోని ప్రసిద్ధ ఆర్థోపెడిక్ నిపుణుల్లో ఒకరు. ఆయన సెంట్రల్ ఆర్థోపెడిక్ ఇన్స్టిట్యూట్ (సీఐఓ) అధిపతి. 39 సంవత్సరాల వైద్యవృత్తిలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వేలాది మందికి స్పైనల్‌కార్డ్ నిపుణుడైన రమేశ్‌కుమార్ చికిత్స అందించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. 2016 సంవత్సరంలో 108 ఏళ్ల మహిళ వృద్ధాప్యం, తుంటి సమస్యలతో బాధపడుతూ మంచం పట్టింది. డాక్టర్ రమేశ్ సవాల్‌గా తీసుకొని హిప్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడంతో ఆమె మూడు రోజుల్లోనే మంచంపై నుంచి లేచి నిలబడింది.
డాక్టర్ రమేశ్ కుమార్ రెండు నెలల కిందట కరోనా బారినపడ్డారు. ప్రారంభంలో ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉంది. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించగా.. వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. సీనియర్ వైద్యుల బృందం ఐసీయూలో ఉంచి.. ఆయనకు చికిత్స అందించింది. కొద్ది రోజులకు ఆరోగ్యం మెరుగైంది. మళ్లీ రెండు వారాల కిందట పరిస్థితి విషమించినట్లు దవాఖాన సీనియర్ వైద్యుడు తెలిపారు.
అనేక ప్రయత్నాలు చేసినా ఆయనను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది షాక్ గురయ్యారు. ఆయన మృతికి డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) సంతాపం ప్రకటించింది. ఆసుపత్రితో పాటు దేశం కష్టపడి పని చేసే అనుభవజ్ఞుడైన వైద్యుడిని కోల్పోయిందని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. సీఐఓను, సప్ధర్‌జంగ్ హాస్పిటల్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేశారని వైద్యులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సిబిల్ స్కోర్‌కు బ్యాంకు రుణాలకు సంబంధమేంటి?
WTC Final Day 1:: తొలి రోజు ఆట వర్షార్పణం
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి..
వ్యాక్సినేషన్లో మరో మైలురాయి దాటిన భారత్
త్వరలో అందుబాటులోకి మరో కరోనా టీకా!
అమర్నాథ్ యాత్రపై త్వరలో నిర్ణయం : జమ్మూకాశ్మీర్ ఎల్జీ
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. ఐదుగురు దుర్మరణం
దేశంలో కొత్తగా 60వేల కరోనా కేసులు
దేశ భద్రతలో కీలకంగా వాయుసేన : ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

