కొడిమ్యాల, మార్చి 27: టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్ర చారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్యర్యంలో చొప్పదండి సోషల్ మీడియా కార్యకర్తల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు, ఫొటోల మార్ఫింగ్‌లు చేసేందుకు సిద్ధమవుతున్నారని, ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త దానిని తిప్పికొట్టాలని సూచించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో తప్పుడు ప్రచారాలు చేసి గెలిచినట్లు గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎకడా లేని పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లో కి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎకువగా సోషల్ మీడియాను తప్పుడు ప్రచారాలకు వాడుతున్నారని, మంత్రి కేటీఆర్ మాత్రం ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కోసమే వాడుతున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మంచిని ప్రచారం చేయాలని దేశ వ్యాప్తంగా తెలియచెప్పిన గొప్ప వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, చొప్పదండి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామన్నారు. నియోజకవర్గంలో 6 మండలాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నిధులు మంజూరైనట్లు చెప్పారు. కార్యక్రమంలో కొడిమ్యాల, మల్యాల, గంగాధర, బోయినపల్లి, రామడుగు, చొప్పదండి గ్రామాల సోషల్ మీడి యా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.