Fake IAS | టీటీడీ విజిలెన్స్ అదుపులో నకిలీ ఐఏఎస్
Fake IAS | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్జాగా దర్శించుకునేందుకు ఓ నకిలీ ఐఏఎస్ (Fake IAS) చేసిన ప్రయత్నాలను టీటీడీ అడ్డుకుంది .
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్జాగా దర్శించుకునేందుకు ఓ నకిలీ ఐఏఎస్ (Fake IAS) చేసిన ప్రయత్నాలను టీటీడీ(TTD) అడ్డుకుంది . వివరాలు ఇలా ఉన్నాయి. నరసింహారావు అనే వ్యక్తి నకిలీ ఐఏఎస్‌గా అవతారమెత్తి గురువారం స్వామివారి దర్శనానికి తిరుమల(Tirumala) కు చేరుకున్నాడు. తాను ఐఏఎస్ అధికారినంటూ టీటీడీ ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖను అందించాడు. తాను జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానని బుకాయించాడు.
లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన ఈవో కార్యాలయ అధికారులు అనుమానించి అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజిలెన్స్ (Vigilence) అధికారులకు అప్పగించారు. వారి విచారణలో నకిలీ ఐఏఎస్‌గా తేలడంతో అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం
తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల రద్దీగా మారింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,570 మంది భక్తులు దర్శించుకోగా 24446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3. 53 ఆదాయం వచ్చిందని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

