బీమాతో బురిడీ..

- తక్కువ ప్రీమియం అంటూ మోసం
- హెల్త్ ఇన్సూరెన్స్ పేరిట అమాయకులకు గాలం
- చెన్నై ముఠా దోపిడీ దందా
- తిరుమలగిరిలో నకిలీ కాల్‌సెంటర్ నిర్వహణ
- నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
- అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు
- నకిలీ సర్టిఫికెట్లు.. 20 సిమ్‌కార్డులు స్వాధీనం
సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): డిస్కౌంట్‌తో కూడిన కుటుంబ ఆరోగ్య బీమా ఇస్తామంటూ.. ఫోన్లు చేస్తూ..అమాయకులను మోసం చేస్తున్న నకిలీ కాల్‌సెంటర్ గుట్టును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. చెన్నైకి చెందిన గోపికృష్ణ వెంకటకృష్ణ ఆర్థిక నేరాలు చేయడంలో ఆరితేరాడు. అక్కడి పోలీసులు అతడిపై పీడీయాక్ట్ కూడా ప్రయోగించారు. పాత నేరస్తుడు అదే రాష్ర్టానికి చెందిన నటరాజ్‌ను సహాయకుడిగా నియమించుకున్నాడు. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో యూనైటెడ్ ఇండియా హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్‌ను ప్రారంభించాడు. మహిళా టెలీ కాలర్స్‌ను నియమించుకున్నాడు. ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఫోన్ నంబర్లకు సంబంధించి బల్క్ డేటాను కొని, భారీగా సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నామంటూ.. కాల్‌సెంటర్ నుంచి ఫోన్లు చేయిస్తూ.. అమాయకులను బుట్టలో వేస్తున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలంటూ..డిపాజిట్లు కూడా సేకరించాడు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం ఆ సెంటర్‌పై దాడి చేసి.. గోపికృష్ణ, నటరాజ్‌ను అరెస్టు చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో 38, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్లో 14 మంది రూ. 5.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు దర్యాప్తులో బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లు, 20 సిమ్‌కార్డులతో పాటు రూ. 18 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

