హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న 16,871 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కాంట్రాక్టు ప్రాతిపదికన(4,081), ఔట్ సోర్సింగ్ విధానంలో(9,009), హనరోరియం సర్వీసుల్లో(3,056) మంది సహా ఇతర కేటగిరీల వారు ఉన్నారు. వీరి సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.