సిరిసిల్ల టౌన్/నిజామాబాద్, నవంబర్ 20: నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై సర్వ త్రా హర్షం వ్యక్తమవుతున్నది. శనివారం పలు జిల్లాల్లో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ చేపట్టిన మహాధర్నాతోనే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నదని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బోధన్ పట్టణం, బోధన్ మండలంలోని జాడిజమాల్పూర్, నవీపేట మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటాలను పాలతో అభిషేకించారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు సీఎం కేసీఆర్, రైతాంగ పోరాటాలతోనే సాధ్యమైందని స్పష్టంచేశారు.