గత పది నెలలుగా రాష్ట్రంలో రోజుకో ధర్నా. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు, గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు, ఏక్ పోలీస్ విధానం కోసం బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు, ఏఈవోలు, ఉద్యోగులు.. హైడ్రా, మూసీ భయంతో నిరుపేదలు, గ్రూప్ 1 అభ్యర్థులు, ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు, రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతులు, గ్యారెంటీల అమలు కోసం నిరుపేదలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు.
ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? బాధితులకు ఊరట కలిగించాలి. ఆర్తులకు ఆసరాగా నిలవాలి. కానీ, కాంగ్రెస్ సర్కారుకు ఆ వివేకమేమీ లేదు. రాష్ర్టాన్ని సమస్యల వలయం నుంచి బయటపడేసే విద్య దానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒక్కటే డైవర్షన్ డ్రామా. తీవ్రమైన సమస్య తలెత్తినప్పుడల్లా ఏదో ఒక పన్నాగం పన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసే రేవంత్ సర్కార్ మళ్లీ అదే పనిచేసింది. పోలీసు యూనిఫామ్‌లో ఉండి రోడ్డుకెక్కిన బెటాలియన్ కానిస్టేబుళ్లతో పాటు, డీఏలు రాక ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు, ఆవేదనలో ఉన్న అన్నదాతలు, రిజర్వేషన్ల పెంపు కోసం ఎలుగెత్తుతున్న బీసీలు, తదితర సబ్బండ వర్గాల వ్యతిరేకతను మసిపూసి మారేడు కాయ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నది. కొన్ని రోజులైనా ప్రజల దృష్టిని మళ్లించకపోతామా? అన్న ధీమాతో కేసీఆర్ కుటుంబానికి డ్రగ్స్ మరకలు అంటించే నీచానికి దిగింది.
వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల పక్షాన పోరాడుతున్న కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన బంధువు ఇంట్లో ఫ్యామిలీ దావత్ చేసుకుంటే దానికీ మరకలంటించేందుకు విఫలయత్నం చేసింది. ఇది పకడ్బందీ కుట్ర అనడానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో రాజకీయ బాంబు పేలబోతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన 48 గంటల్లోనే ఈ ఘటన జరిగింది. మరోవైపు కాంగ్రెస్‌కు అనుగుణంగా పనిచేసే ఒక మీడియా హ్యాండిల్.. ఈ సోదాలు, దాని పర్యవసనాలను కొన్ని గంటలముందే పూసగుచ్చినట్టు చెప్పింది.
Congress Govt | హైదరాబాద్/సిటీబ్యూరో/చేవెళ్ల రూరల్/శేరీలింగంపల్లి/కొండాపూర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన కుటుంబసభ్యులతో నిర్వహించుకుంటున్న దావత్‌పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన సందర్భంగా కుటుంబసభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, బంధుగణంతో తన ఇంట్లో రాజ్ పాకాల దావ త్ నిర్వహిస్తుండగా.. పోలీసులు పథకం ప్రకా రం దాడి చేసి శనివారం అర్ధరాత్రి నానా హం గామా సృష్టించారు. ‘ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నదనే సమాచారం మాకుంది. డయల్ 100కు కాల్ చేశారు. అందరూ డ్రగ్స్ టెస్టుల కు సహరించాలి’ అంటూ అక్కడున్న కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు.
‘ఇదంతా ఫ్యామిలీ పార్టీ.. ఇక్కడ డ్రగ్స్ ఎందు కు ఉంటాయి. కాకపోతే కొందరు మద్యం తా గారు. అంతకు మించి ఇంకేమీ లేదు’ అని కుటుంబసభ్యులు ఎంత వారించినా పోలీసు సిబ్బంది వినకుండా పథకం ప్రకారం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన జన్వాడకు చేరుకున్న ఎక్సైజ్ సిబ్బంది పరిమితికి మించి ఉన్నాయన్న ఆరోపణలతో 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని రెచ్చగొట్టి, పోలీసులు నానా హంగామా చేశారని బాధితులు చెప్పుకొచ్చారు. ఆ ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో రాజ్ పాకాల తల్లి, మాజీ మంత్రి కేటీఆర్ అత్తమ్మ, వారి కుటుంబసభ్యు లు, చిన్నపిల్లలు ఉండగా వారిని కూడా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని బలవంత పెట్టా రు. వారు డ్రగ్స్ టెస్టులకు మొదట ఒప్పుకోకున్నా బలవంత పెట్టి.. టెస్టులు చేయగా అం దరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఈ క్రమంలో ఇటీవల నెదర్లాండ్ నుంచి వచ్చిన విజయ్ మద్దూరి అక్కడి రూల్స్ ప్రకారం కొంత కొకైన్ తీసుకున్నాడని, అతనికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వృద్ధులు, పిల్లలు, చివరికి భార్యాభర్తలను విడదీసి మహిళలు, పురుషులుగా పోలీసులు లెక్కగట్టి మొత్తం 35 మంది పాల్గొన్నట్టు రిపోర్టులు రాశారు.
హైదరాబాద్‌లోని ఓరియన్ విల్లాస్ వద్ద సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల ఇంటి లోపలికి
వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు
ఇద్దరిపై కేసు నమోదు
అనుమతి లేకుండా పార్టీ జరుగుతున్నదని వచ్చిన సమాచారంతో జన్వాడలోని ఇంటిపై సైబరాబాద్ ఎస్వోటీ, ఆబ్కారీ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపినట్టు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. 7 విదేశీ మద్యం బాటిళ్లు, 10 దేశీయ మద్యం బాటిళ్లు, గేమ్స్‌కు సంబంధించిన కాయిన్స్ లభించినట్టు వివరించారు. విజయ్ మద్దూరి అనే వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఆ దావత్లో పాల్గొన్న అందరికీ నెగిటివ్ వచ్చినట్టు చెప్పారు. విజయ్‌ని రక్త పరీక్షల కోసం దవాఖానకు తరలించినట్టు చెప్పారు. ఈ మేరకు రాజ్ పాకాలతో పాటు విజయ్ మద్దూరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద సెక్షన్ 25, 27, 29తో పాటు తెలంగాణ గేమింగ్ చట్టం 3, 4 సెక్షన్ల కింద మోకిల ఠాణా లో కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు రాజ్ పాకాలపై ఎక్సైజ్ చట్టం ప్రకారం 34ఏ, 34(1), రెడ్‌విత్ 9 కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
రేవ్ పార్టీగా చిత్రీకరించే కుట్ర
కేసీఆర్, కేటీఆర్ కుటుంబంపై బురదజల్లే నెపంతో ఆదివారం ఉదయం నుంచి పోలీసులు ప్రభుత్వ అనుకూల మీడియాకు లీకులు ఇవ్వడం ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే ఫ్యామిలీ దావత్‌ను ‘రేవ్ పార్టీ’గా చిత్రీకరించిన కాంగ్రెస్ అనుకూల మీడియా నానా హడావుడి చేసింది. దీంతో పోలీసులు ఫారెస్ట్ రిజర్వ్ కాలనీలో అక్రమంగా దాడి చేసిన అం శాలపై దృష్టి మరల్చి.. అక్కడ భారీగా డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు, విదేశీ మద్యం దొరికిందంటూ మీడియాకు లీకులు ఇస్తూనే ఉన్నా రు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతుండటం.. కావాలనే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని గ్రహించి.. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్, పోలీసు ఉన్నతాధికారులు జన్వాడకు చేరుకొని దావత్ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మీడియాలో చూపినట్టుగా అది రేవ్ పార్టీ కాదని, ఫ్యామిలీ దావత్ అని గుర్తించారు. మధ్యాహ్నానికే అది ఫ్యామిలీ దావత్ అని ప్రభుత్వ పెద్దలకు ఫీడిం గ్ ఇవ్వడంతో సాయంత్రం వరకు ఆ ఇష్యూ ను కొనసాగించాలనే కుట్రలో భాగంగా రాయదుర్గంలోని విల్లాల్లో సోదాలకు యత్నించారు.
రాయదుర్గంలో ఉద్రిక్తత
రాజ్ పాకాల కేటీఆర్‌కు స్వయానా బా మ్మర్ది కావడంతో కావాలనే రాజకీయ కుట్రను ప్రేరేపిస్తూ వారికి సంబంధించిన ఇండ్లల్లో సోదాలు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం చూపడంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. వారే కావాలని ఏమైనా నిషేధిత వస్తువులు తీసుకెళ్లి, ఇండ్లలో సోదాల పేరుతో అక్కడ ఫలానా నిషేధిత వస్తువులు దొరికాయని చెప్పి అక్రమ కేసులు పెడతారనే ముందస్తు ఆలోచనతో బీఆర్ఎస్ నేత లు రంగంలోకి దిగారు. రాయదుర్గంలోని కేటీఆర్, రాజ్ పాకాల, అతడి సోదరుడు శైలేంద్ర ఇండ్లకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మొద ట సెర్చ్ వారెంట్లు లేకుండా రావడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారని నిలదీశారు. తమను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఈ డ్చి పడేశారు. అందినవారిని అందినట్టే ఇష్టారీతిన దొబ్బుతూ డొక్కల్లో గుద్దుతూ, మోకాళ్లతో తన్నుతూ గుంజి పడేశారు. అక్కడ ఆందోళనలు తీవ్రతరం అవుతుంటే మళ్లీ వెళ్లి సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి, కొన్ని గంటల పాటు వారి ఇండ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎక్కడా ఏమీ లభించలేదు.
బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు
ఇటు రాజ్ పాకాల, అతడి సోదరుడు శైలేంద్ర, మాజీ మంత్రి కేటీఆర్ ఇండ్లలో సోదాలు చేసేందుకు పోలీసులు యత్నించడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, డాక్టర్ సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ సహా ఇతర నేతలను అరెస్టు చేసి, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేటీఆర్ ఇంట్లో ఉన్న నాయకులను అరెస్టు చేసి రామచంద్రాపురం పీఎస్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో కో రుట్ల ఎమ్యెల్యే డా.సంజయ్, డా.కురువ విజ య్ కుమార్, రాకేశ్, ముఠా జైసింహ, రాజీవ్ సాగర్, తుంగ బాలు తదితరులు ఉన్నారు.
పోలీసుల దాడిలో బాల్క సుమన్‌కు గాయాలు
రాయదుర్గంలోని రాజు పాకాల నివాసం ఓరియన్ విల్లాస్‌పై దాడులు చేస్తున్నారనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పోలీసులు దాడులు చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలెందుకు చేస్తున్నారని నిలదీస్తున్న సందర్భంలో పోలీసులు ఈడ్చి పడేశారు. ఈ ఘటనలో బాల్క సుమన్ కాళ్లకు గాయాలయ్యాయి. అయినా పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి ఆర్సీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
జన్వాడలో ఏమీ దొరకలేదు చేవెళ్ల ఎైక్సెజ్ ఇన్స్పెక్టర్ శ్రీలత
జన్వాడలో రేవ్ పార్టీ జరుగుతున్నదనే సమాచారంతో దాడులు చేశామని, కానీ అక్కడ ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని చేవెళ్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీలత ప్రకటించారు. తనిఖీల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్ నిబంధనలు పాటించనందు న కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ఎలాంటి డ్రగ్స్ దొరకలేదు: జేసీ ఖురేషీ
జన్వాడలోని రాజ్ పాకాలకు చెందిన ఇంట్లో డ్రగ్స్గాని, డ్రగ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు గానీ లభించలేదని దాడులకు నేతృత్వం వహించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషీ స్పష్టం చేశారు. కొన్ని మద్యం బాటిళ్లు మాత్రమే లభించినట్టు వెల్లడించారు.
అనుమతి లేనందున కేసులు పెట్టాం
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజ్ పాకాలకు సంబంధించిన ఇంట్లో అనుమతి లేకుండా పార్టీ జరుగుతున్నదని వచ్చిన సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులతో కలిసి దాడులు జరిపాం. తనిఖీల్లో ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. 7.1 లీటర్ల ఇంపోర్టెడ్ మద్యం, ఒకటి న్యూ ఢి ల్లీకి చెందిన నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిల్, 11 టీజీ ఐఎంఎఫ్ఎల్ బాటిళ్లు, మహారాష్ట్రకు చెందిన 0.75 లీటర్ల నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం, 11 కేఎఫ్ అల్ట్రా బీర్ బాటిళ్లు లభించాయి. ఈ పార్టీని ఆ బ్కారీ శాఖ అనుమతి లేకుండా రాజ్ పా కాల నిర్వహించినట్టు తేలింది. అంతే కా కుండా నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం కూ డా ఈ పార్టీలో వినియోగించినట్టు తేలిం ది. ఈ రెండు ఉల్లంఘనల నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 34(ఏ), 34(1), 9(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. – కమలాసన్‌రెడ్డి,ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
అనుమతి లేని మద్యం ఉన్నందుకే సోదాలు ; రంగారెడ్డి డీసీ దశరథ్
హైదరాబాద్ సిటీబ్యూరో/శేరీలింగంపల్లి/కొండాపూర్: రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో శైలేందర్ పాకాల, రాజ్ పాకాల ఇండ్లల్లో అనుమతి లేని మద్యం ఉన్నందుకే సోదాలు చేపట్టినట్టు రంగారెడ్డి జిల్లా డీసీ దశరథ్ తెలిపారు. ఆదివారం విల్లాస్లోని తనిఖీలపై ఆయన మాట్లాడారు. అనుమతి లేని నాన్డ్యూ టీ పెయిడ్, ఫారిన్ లిక్కర్ ఉన్నందుకే తాము దాడులు చేస్తున్నామని ప్రకటించారు. ఇక్కడ విల్లాల ఓనర్స్ లేరని, వారికి సంబంధించిన వారు మాత్రమే ఉన్నారని, వారి సమక్షంలోనే సోదాలు చేస్తున్నామని చెప్పారు.
తలుపులు పగులగొట్టి తనిఖీలు..
ఓరియన్ విల్లాస్‌లో శైలేందర్ పాకాలకు చెందిన విల్లా నంబర్-5లో ఆ బ్కారీ జేసీ ఖురేషీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు జరిపారు. షోకేజ్, గదుల తాళాలు పగులగొట్టి మరీ సోదా లు చేశారు. అదే సమయంలో రాజ్ పా కాలకు చెందిన విల్లా నంబర్-40లో 6 నుంచి 7గంటలపాటు విస్తృతంగా తనిఖీలు జరిపారు. యజమాని అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడడమే కాకుండా తలుపులు బద్దలు కొట్టారు.
ఇది ఇల్లీగల్ సెర్చ్:న్యాయవాది జెక్కుల లక్ష్మణ్
ఓరియన్ విల్లాస్లోని రాజ్ పాకాల, అతని బంధువుల ఇండ్లల్లో సెర్చ్ వారెంట్ లేకుండా ఇల్లీగల్ సెర్చ్ జరిగింది. పోలీసులు అక్రమంగా ఇండ్లల్లోకి చొరబడి ట్రెస్‌పాస్‌కు పాల్పడ్డారు. దీనిపై డీజీపికి ఫిర్యాదు చేశాం. ఈ విషయాన్ని కోర్టులో చాలెంజ్ చేస్తాం.