హైదరాబాద్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) ద్వారా 53 మంది అధికారులకు పదోన్నతులు వచ్చాయి. సోమవారం జరిగిన సమావేశంలో డీపీసీ ఛైర్మన్ వికాష్‌రాజ్, జెడీ కన్వీనర్ సెకట్రరీ బెనహార్ మహేష్ దత్ ఎక్క, డీపీసీ మెంబర్స్, ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు, ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్, ఇండస్ట్రియల్ సెక్రెటరీ సంజయ్ కుమార్.. 53 మంది ఎక్సైజ్ అధికారుల పదోన్నతుల కోసం సిఫారసు చేశారు.
అడిషనల్ కమిషనర్లుగా ఇద్దరికి, జాయింట్ కమిషనర్లుగా ఇద్దరికి, డిప్యూటీ కమిషనర్లుగా 12 మందికి, అసిస్టెంట్ కమిషనర్లుగా 14 మందికి, ఎక్సైజ్ సూపరింటెండ్లుగా 23 మందికి డీపీసీ ద్వారా పదోన్నతులు వచ్చాయి. ఈ పదోన్నతులపై ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో జీవో జారీ చేయనుందని తెలిసింది. పదోన్నతులు వచ్చిన అధికారులందరూ మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతులు తెలిపారు.
కమిషనర్‌ను కలిసిన వారిలో అడిషనర్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ సురేష్ రాథోడ్, డిప్యూటీ కమిషనర్లు పీ దశరథ్, అనిల్ కుమార్ రెడ్డి, ఏసీలు చంద్రయ్య, శ్రీధర్, శ్రీనివాసులు, ఈసీలు ప్రదీప్‌రావు, కృష్ణ ప్రియ, ఉజ్వలరెడ్డి, జీవన్ కిరణ్‌లు ఉన్నారు.