Wrestlers Woes : కుస్తీ పోటీల్లో భావితారలుగా ఎదుగుతున్న కుర్రాళ్లకు ఘోర అవమానం జరిగింది. పతకాలతో దేశ, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడించే యువ రెజ్లర్ల(Wrestlers)కు కనీస మర్యాద కూడా దక్కలేదు. అసలేం జరిగిందంటే.. స్కూల్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఒడిశాకు చెందిన రెజ్లర్లు ఉత్తరప్రదేశ్ రైలు ఎక్కారు. అయితే.. వారంతా టాయిలెట్ల దగ్గరే కూర్చొని.. చలికి వణుకుతూ ప్రయాణించాల్సి వచ్చింది. వారి ఇబ్బందిని కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో.. విద్యా శాఖ మంత్రి నిత్యానంద గోండ్ విచారణకు ఆదేశించారు.
యువ రెజ్లర్లకు టికెట్ బుక్ చేసి పంపాల్సింది పోయి.. వారిని చల్లని చలికి వణుకుతూ ప్రయాణించేలా చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలతో కూడిన 18 మంది యువ రెజ్లర్ల బృందం టాయిలెట్ కంపును భరిస్తూనే జర్నీ చేశారు. రెజ్లర్ల దుస్థితిని కళ్లకు కట్టిన ఈ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోతి పట్నాయక్ (Navajyoti Patnaik) పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
The visuals of 18 young Odisha wrestlers being forced to sit near train toilets in biting cold are a national embarrassment. These athletes were travelling to Uttar Pradesh to represent our state in the national school wrestling championship.
This is the true face of the BJP… pic.twitter.com/unrzPn8uds
— Navajyoti Patnaik (@NavjyotiPatnaik) December 23, 2025
ఒడిశా ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చిన ఈ వైరల్ వీడియోపై మంత్రి మాట్లాడుతూ..’ రెజ్లర్లు టాయిలెట్ దగ్గర కూర్చొని ప్రయాణించడంపై విచారణకు ఆదేశించాం. అసలు ఏం జరిగిందో తెలుసుకొని.. అందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.
ఈ ఏడాది ఒడిశా ప్రభుత్రం క్రీడలకు పెద్దపీట వేస్తామని ప్రకటించింది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తామని.. తగిన వసతులు కల్పిస్తామని చెప్పింది. కానీ, ఇవన్నీ ఆచరణలో మాత్రం అగుపించడంలేదు. తాజాగా రెజ్లర్లను టాయిలెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించేలా చేయడంతో ఆ ప్రభుత్వం మాటలకే పరిమితమైందనే విషయం స్పష్టమవుతోంది.