రామగిరి, డిసెంబర్ 23 : విద్యార్థి స్థాయి నుండే ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలని క్యాట్కో (Confederation of All Telangana Consumer Organisations) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని శాస్త్ర హై స్కూల్లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. స్కూల్ కరస్పాండెంట్ కె.కిశోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపాల్ రమేశ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. డిసిఐసి కన్వీనర్ చింతమల్ల గురవయ్య, వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మట్టయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.ముస్తఫా మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, ఫిర్యాదులు, పరిష్కారా మార్గాలు, ఆహార కల్తీలు, తూనికలు కొలతల్లో జరుగుతున్న మోసాలను వివరించారు. అనంతరం ఉపన్యాస పోటీల్లో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు.