Excise | వినాయక నగర్, జూన్: 13: నిజామాబాద్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం నిర్వహించిన దాడుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా నిజామాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, పి.స్వప్న శుక్రవారం వెల్లడించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ నగరంలోనీ బాబన్ సహా పహాడ్ ఏరియాలో గల జాకీర్ ఫార్మ్ హౌజ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ బృందం దాడులు నిర్వహించి తనిఖీలు చేసినట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో షేక్ షకీల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుండి గ్రా.134 ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం సదరు నిందితుడు గంజాయిని దాగే మధుకర్ వద్ద నుండి కొనుగోలు చేసినట్లు సమాచారమిచ్చినట్లు తెలిపారు. దీంతో దాగే మధుకర్ ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించగా అక్కడ దాగే దాతురం అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్దనుండి గ్రా.50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వప్న తెలిపారు.
ఇద్దరు వద్దనుండి మొత్తం ఒక గ్రా.184 గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను నిజామాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. మరో నిందితుడైన దాగే మధుకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న తో పాటు ఎస్సై రామ్ కుమార్, సిబ్బంది నారాయణరెడ్డి, అమీద్, శివ, ప్రీతం, అవినాష్, భోజన్న, విష్ణు, రాజన్న తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు.