Kakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియాను మీ ఎమ్మెల్యేలే నడుపుతున్నారని తెలిపారు. మీ నాయకులే బెల్టు షాపులు నడుపుతున్నారని, ఎన్నో గోరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎలాగూ ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది కనుక.. దమ్ముంటే వాటిపై విచారణ జరిపి తొక్కి పెట్టి నార తీయాలని సవాలు విసిరారు.
కూటమి పాలనకు, జగన్ సంక్షేమ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం మానకపోతే కూటమి నాయకుల అవలక్షణాలన్నీ బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైఎస్ జగన్ను ఎదుర్కొనలేక ఆయన కుటుంబంపై వివిధ రకాలుగా మాట్లాడుతున్నారని కాకాణి మండిపడ్డారు. వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలను తీసుకురావడం సిగ్గుచేటు అని విమర్శించారు. వందల కోట్ల ఆస్తులు ఉన్న చంద్రబాబు తన సోదరుడు, చెల్లెళ్లకు ఎంత మేర పంచాలో చెప్పాలని డిమాండ్ చేశారు.