కొల్లాపూర్: సామాజిక సేవలో ( Social Service ) ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ అన్నారు. శనివారం కొల్లాపూర్ ( Kollapur ) పట్టణ కేంద్రంలో రత్నగిరి ఫౌండేషన్ ( Ratnagiri Foundation ) డైరెక్టర్ జూపల్లి అరుణ్ జన్మదిన సందర్భంగా ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో విద్యార్థులు కేకు కట్ చేసి మొక్కలు నాటారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ సర్కిల్లో భారీ కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం పని చేసినప్పుడు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జూపల్లి అరుణ్ సూచనతో కొల్లాపూర్ నియోజక వర్గంలోని యువతకు నైపుణ్యాలను పెంపొందించేందుకు పలు సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు వివరించారు. యువతకు డ్రోన్ శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చి స్కిల్ పెంచడంతోపాటు ప్లేస్మెంట్ అవకాశం కల్పిస్తామన్నారు.
కార్యక్రమంలో మాసి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండీ ఎక్బాల్, వాల్మీకి సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు తలారి ప్రసాద్ నాయుడు, నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, కృష్ణమ నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహ, మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు, ముస్తాక్ పాషా, బోరెల్లి మహేష్, దిలీప్, ఖాదర్ బాషా, ప్రకాష్, డాక్టర్ శ్రీనివాసులు, వాసు, నయూమ్, సెంట్రింగ్ కురుమయ్య, కర్ణ తదితరులు ఉన్నారు.