Khairatabad Ganesh | హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కన్నుల పండువగా సాగింది. మహా గణపతి శోభాయాత్రను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి. భక్తుల జయజయధ్వనాల మధ్య క్రేన్ నంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నారు.
అయితే సెక్రటేరియట్ వద్ద ఖైరతాబాద్ మహా గణపతి డ్రోన్ విజువల్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. 4వ నంబర్ క్రేన్ వద్దకు చేరుకున్న తర్వాత డ్రోన్ కెమెరాలతో మహా గణపతిని చిత్రీకరించారు. అటు సెక్రటేరియట్.. ఇటు ట్యాంక్ బండ్, మధ్యలో మహా గణపతి దృశ్యాలు అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. మరి మీరు కూడా ఓ లుక్కేయండి మహా గణపతి డ్రోన్ విజువల్స్‌పై..
TeluguScribe exclusive
సెక్రటేరియట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతి డ్రోన్ విజువల్స్ pic.twitter.com/r27VB3NHmg
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2025