Praveen Sood | హైదరాబాద్ : సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ప్రవీణ్ సూద్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న శ్రీశైలం వెళ్లిన ప్రవీణ్ సూద్.. శనివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. సీబీఐ గెస్ట్ హౌస్‌లో ప్రవీణ్ అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు.