కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే టీకానే శ్రీరామరక్ష అని, అందుకే టీకాలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తిలోని పీర్లగుట్టలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో 12-14 ఏండ్ల చిన్నారులకు కొవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకుగానూ ముందస్తు చర్యలు చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. ప్రస్తుతం చిన్నారులకు టీకాలు వేయించాలని సూచించారు.
వనపర్తి రూరల్, మార్చి 16 : రాష్ట్రంలోని చిన్నారులను కరోనా నుంచి కాపాడాలంటే.. ప్రతి ఒక్కరికీ వ్యా క్సిన్ వేయించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో 12-14 ఏండ్ల చిన్నారులకు కొవిడ్ టీకా వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ షేక్ యా స్మిన్ బాషాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకుగానూ ముందస్తు చర్యలు చేపట్టిన ఏకైక రా ష్ట్రం తెలంగాణే అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా థర్డ్ వేవ్‌లో చిన్నారులకు ప్రమాదం ఎక్కువగా ఉన్నద ని హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు వేస్తున్నట్లు చెప్పారు. అందుకే వైద్యాధికారులతోపాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయించాలని సూచించారు. అనంతరం కలెక్ట ర్ మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారంగా అన్ని విద్యాసంస్థలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2010 మార్చి 15 ముందు జన్మించిన వారికి వ్యాక్సిన్లు వేసినట్లు వివరించారు. వంద శా తం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చ ర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా జాతీయ ఇమ్యూనైజేషన్ దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలను సన్మానించిన అనంతరం వారికి సర్టిఫికెట్లను మంత్రి, కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి రూరల్, మార్చి 16 : వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్, నర్సింగ్ కళాశాల పనుల్లో వేగం పెంచాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పనుల్లో అలస త్వం వహిస్తే కాంట్రాక్ట్ రద్దు చేయిస్తామని హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో నిర్మాణమవుతున్న మెడికల్, నర్సింగ్ కళాశాల పనులను కలెక్టర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు నెమ్మదిగా చేయడం సరికాదన్నా రు. పలుమార్లు ఆదేశించినా వేగవంతం చేయడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మూడు షిఫ్ట్‌లు సిబ్బందిని నియమించి ఏప్రిల్ 15లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి రోజూ పనులు పర్యవేక్షించాలని సూచించారు. వైద్యశాఖాధికారులు ప్రతిరోజూ రెం డు సార్లు పనులను పరిశీలించి కలెక్టర్‌కు పురోగతి వివరించాలన్నారు. 17న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కోసం ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీ న్ మిట్టల్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని తెలిపారు. రె వెన్యూ, ఇతర అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూ చించారు. రింగ్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ పనుల్లో ప్రభుత్వ భూమి కాకుండా పట్టా భూము లు కోల్పోతున్న వారికి భూమికి భూమి ఇప్పించనున్న ట్లు వివరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో అమరేందర్, ఉద్యాన శాఖ అ ధికారి సురేశ్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్, తాసిల్దార్ రా జేందర్గౌడ్, మెడికల్ కళాశాల వైద్యాధికారులు, కాంట్రాక్టర్ రామారావు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.