మరికల్ : నారాయణపేట జిల్లాలో ధనధాన్య కృషి యోజన ( Dhan Dhanya Krishi Yojana ) పథకం మంజూరు కావడం పట్ల మరికల్ మండల కేంద్రం తెలంగాణ చౌరస్తాలో బీజేపీ (BJP) మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఎంపీ డీకే అరుణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డోకూరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతుల శ్రేయస్సుకు ధనధాన్య కృషి యోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు రైతుల అభివృద్ధి కి ప్రతి ఏటా రూ. 1,440 కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం (Center Grants ) మంజూరు చేసిందన్నారు.
ఈ నిధులతో రైతులకు నాణ్యమైన విత్తనాలు, సామాగ్రిని అందజేస్తారని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, వడ్డే శ్రీరామ్, వెంకటేష్, రమేష్, సురేందర్ గౌడ్, గొల్ల రాజేష్ యాదవ్, నరేష్ గౌడ్, మోహన్ రెడ్డి, వై డి గుప్తా, మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, అశోక్ కుమార్, మాజీ ఉపసర్పంచులు శివకుమార్, పాపిరెడ్డి, నాయకులు నరేష్ కుమార్ రెడ్డి, వెంకటేష్, సురేష్, ప్రతాప్ రెడ్డి, కురుమన్న, మల్లారెడ్డి, చెన్నయ్య, గూప నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.