సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు చెల్లిస్తామని, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సంబురాలు మిన్నంటాయి. బుధవారం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆయా శాఖల ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫొటోలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. సంబురాలు నిర్వహించుకుని స్వీట్లు తినిపించుకున్నారు. సీఎం చేసిన ప్రకటన తమపై మరింత బాధ్యతను పెంచిందని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యేలా కృషి చేసి రాష్ర్టానికి మంచి పేరు తెస్తామని ప్రకటించారు.
సంగారెడ్డి, మార్చి 16 : ఐకేపీ సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభ ఉత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు ఇవ్వడం, ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సంబురాల్లో మిన్నంటాయి. దీంతో ఆయా శాఖల ఉద్యోగులు సీఎం కేసీఆర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చేసిన ప్రకటనతో సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 207 మంది ఐకేపీ సిబ్బంది, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లకు మేలు జరగనుంది. మెదక్ జిల్లాలోనూ వందలాది మందికి లబ్ధి జరగనున్నది.
తెలంగాణ సర్కారు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా ఐకేపీ సెర్ప్, మెప్మా ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నది. త్వరలో అందుకు సంబంధించిన జీవోలు జారీచేసి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధ్దతిన పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధ్దీకరణ చేస్త్తామని, ఖాళీగా ఉన్న 80 వేల పోస్టులను భర్తీచేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ ప్రకటించి అమలు చేసిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, యవతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారని సెర్ప్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులతో కలిసి పనిచేస్తున్న 194 మంది సెర్ప్ ఉద్యోగులు, 13 మంది మెప్మా సిబ్బందికి లబ్ధ్ది చేకూరనున్నది. సెర్ప్‌లో డీపీఎమ్స్ నుంచి ఎంఎస్‌సీసీలు వరకు, మెప్మాలో డీఎంసీ నుంచి డాటా ఏంట్రీ ఆపరేటర్ వరకు వేతనాలు పెరుగనున్నాయి. సెర్ప్‌లో డీపీఎంలు-5 మంది, ఏపీఎంలు-30 మంది, సీసీలు-62 మంది, ఎంబీకేలు-19 మంది, కార్యాలయ సిబ్బంది-12 మంది, ఎంఎస్‌సీసీలు-66 మందితో పాటు మెప్మా సిబ్బందిలో డీఎంసీ-1, అసిస్టెంట్ డీఎంసీలు-2 మంది, టీఎంసీలు-2 మంది, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు-4 మంది, ఒక జూనియర్ అసిస్ట్టెంట్తో పాటు ముగ్గురు డాటా ఎంట్రీ ఆపరేటర్లకు వేతనాలు పెరుగనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచితే విధి నిర్వహణలో కూడా బాధ్యతలు పెరుగుతాయి. సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి పలుమార్లు సీఎంను కలిసి వివరాలు తెలిపాం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలతో సమానంగా సెర్ప్ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించడం గొప్పనిర్ణయం. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సెర్ప్ సిబ్బంది ఎంతో కృషిచేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– వెంకట్, సెర్ప్ ఉద్యోగులు సంఘం రాష్ట్ర కోశాధికారి
సెర్ప్ ఉద్యోగుల బాధలను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ నిర్ణయానికి రుణపడి ఉంటాం. ఉద్యోగుల బాధలు గుర్తించి వేతనాలు పెంచడం సంతోషకరం. భవిష్యత్‌లో ప్రజలకు లబ్ధ్ది చేకూర్చే ఏ పథకాలు ప్రవేశ పెట్టినా విజయవంతం చేసేందుకు మావంతు పాత్ర పోషిస్తాం. ఇది ఉద్యోగుల పక్షాన హామీ ఇస్తూ ముఖ్యమంత్రికి మా కృతజ్ఞతలు.
– దేవేందర్, సెర్ప్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి
మెదక్, మార్చి 16 : ఉద్యోగులంతా తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలం కూచన్పల్లిలోని ఎమ్మెల్సీ వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్ప్, ఐకేపీ, మెప్మా ఉద్యోగులు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్, హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచులు రాజేందర్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, శివప్రసాద్, స్వామినాయక్, సెర్ప్ ఉద్యోగ జేఏసీ నాయకులు శ్రీరాంనాగరాజ్, లక్ష్మీ, నర్సమ్మ, సరిత, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, వెంకటేశం, ఇందిరా, ప్రసాద్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.