కీవ్: కష్టకాలంలో ఉన్న ఉక్రెయిన్ను ఆదుకొని గొప్ప మనసును చాటుకున్నారు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా తన వ్యూహాల్లో భాగంగా ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నది. ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితిలో ఉక్రెయిన్ ప్రజలు ఉన్నారు. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతున్నాయి. దీంతో ఆ దేశ ఉప ప్రధాని ఫెడరవ్.. సాయం చేయాలంటూ మస్క్‌కు ట్వీట్ చేశారు. వెంటనే తన ఫైబర్ నెట్వర్క్ ‘స్టార్‌లింక్’ ఉక్రెయిన్‌లో పనిచేసేలా మస్క్ చర్యలు తీసుకొన్నారు.