న్యూఢిల్లీ: కుప్పి గెంతులు, పరుగులు, ఆటలతో అలసిపోయిన ఒక ఏనుగు పిల్ల గాఢ నిద్రలోకి వెళ్లింది. కొంత సేపటి తర్వాత దానిని లేపేందుకు తల్లి ఏనుగు ప్రయత్నించింది. అయితే ఆ పిల్ల ఏనుగు ఎంతకీ నిద్ర నుంచి లేవకపోవడంతో అది ఆందోళన చెందింది. సంరక్షులకు తనదైన మూగభాషలో చెప్పి సహాయం కోరింది. దీంతో సిబ్బంది వచ్చి ఏనుగు పిల్లను గట్టిగా తట్టడంతో అది నిద్ర నుంచి లేచింది. చెంగున ఎగురుతూ తల్లి ఏనుగు చెంతకు చేరింది.
చెక్ దేశ రాజధాని పరాగ్వే జూలో కొన్నేండ్ల కిందట జరిగిన ఈ సంఘటన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ పాండే శుక్రవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఏనుగులు చాలా తెలివైనవని, వాటి చర్యలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయని అందులో పేర్కొన్నారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. బిడ్డ పట్ల తల్లి ప్రేమ, ఆవేదనకు ఈ ప్రపంచంలో ఏదీ కూడా సాటి రాదని ఒకరు వ్యాఖ్యానించారు. తల్లి ఏనుగు ఆవేదన గమనించి సహాయం చేసిన జూ సిబ్బందిని కొందరు ప్రశంసించారు.
After running and frolicking, an elephant calf went into a slumber. Worried mother sought help of zoo keepers to wake him up. Elephants are intelligent and social animals and interesting to observe. An old video from Prague Zoo. https://t.co/EFNnYe0FNc
— Ramesh Pandey (@rameshpandeyifs) March 5, 2021