నల్లగొండలో ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్ల నిరసన
నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జేబీఎం సిస్కాన్ మ్యాన్ పవర్ సంస్థ ప్రతినిధుల తీరును నిరసిస్తూ తెల్లవారుజామున 4 గంటల నుండి ఎలక్ట్రికల్ బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన తెలిపారు. శనివారం నల్లగొండ డిపో ముందు...
– వేతనాలు పెంచాలి, కక్షపూరిత చర్యలు మానుకోవాలని డిమాండ్
– మూడు గంటలు బస్సులు నిలిపివేత
నల్లగొండ సిటీ, అక్టోబర్ 31 : నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జేబీఎం సిస్కాన్ మ్యాన్ పవర్ సంస్థ ప్రతినిధుల తీరును నిరసిస్తూ తెల్లవారుజామున 4 గంటల నుండి ఎలక్ట్రికల్ బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన తెలిపారు. శనివారం నల్లగొండ డిపో ముందు ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి.సలీం మాట్లాడుతూ.. 16 నెలలుగా పని చేస్తున్న ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్ల వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని, యూనియన్ ఏర్పాటు చేసుకున్నందుకు యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. డ్రైవర్ల ఎలాంటి తప్పులు లేకున్న డ్యూటీలు ఇవ్వకుండా ఆపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట, వరంగల్ డిపోలలో పిఎఫ్, ఈఎస్ఐతో కలిపి రూ.26 వేల వేతనం ఇస్తుండగా నల్లగొండలో మాత్రం రూ.20 వేలు మాత్రమే ఇస్తూ శ్రమ దోపిడికి గురి చేస్తున్నారని దుయ్యబట్టారు.
వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని అనేకమార్లు వినతి పత్రాలు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోగా యూనియన్ లీడర్లుగా ఉన్న డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తూ డ్యూటీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే డ్యూటీ నిలిపివేసిన సోమయ్య, మురళి, కృష్ణారెడ్డితో పాటు మరో 15 మందిని విధుల్లోకి తీసుకోవాలని, వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జేబీఎం సిస్కాన్ నల్లగొండ డిపో ప్రతినిధులు సాయి కిరణ్, కత్తుల యాదయ్య జోక్యం చేసుకుని హెడ్ ఆఫీస్ వారితో మాట్లాడి నాలుగో తేదీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని అందులో వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించి డ్రైవర్లు యధావిధిగా విధుల్లోని చేరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్లగొండ డిపో అధ్యక్షుడు కాసాన్ రమేష్, కార్యదర్శి పొట్టపాంగి గణేష్, కోశాధికారి పూల సోమన్న నాయుడు, ఉపాధ్యక్షుడు సింగపంగా మురళి, మచ్చ నాగార్జున, జల్లుల వీరారెడ్డి, బొడ్డుపల్లి సైదులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

