Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
DiljitDosanjh | పంజాబీ స్టార్ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh), కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి తెరపడింది.
Diljit Dosanjh | పంజాబీ స్టార్ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh), కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. ఈ సమస్యపై అభిజీత్ దిప్కే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలపాలని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దిల్జీత్ స్పందిస్తూ.. తాను కేవలం కళాకారుడిని మాత్రమేనని, రాజకీయాలకు దూరంగా ఉంచాలని అప్పట్లో బదులిచ్చారు. అయితే సినిమాలలో సామాజిక అంశాలను చూపిస్తూ, రియల్ లైఫ్‌లో విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవడం ద్వంద్వ ప్రమాణాలవుతుందని దిప్కే అప్పట్లో విమర్శించారు. దీనిపై ఇటీవల ఢిల్లీలోని జేఎన్‌యూ స్టేడియంలో జరిగిన తన కన్సర్ట్‌లో దిల్జీత్ పరోక్షంగా స్పందిస్తూ.. తాను కేవలం ఆర్టిస్ట్ అని, పంజాబీలకు పోట్లాడటం ఎలాగో నేర్పించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో దిప్కే తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ దిల్జీత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. చిన్న తమ్ముడిగా భావించి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి. మీ గత వ్యాఖ్యలతో బాధపడినప్పటికీ, మీపై నాకు ఎలాంటి వ్యక్తిగతంగా కక్ష లేదు. నిజానికి నేను మీకు వీరాభిమానిని, ఆ అభిమానంలో ఎలాంటి మార్పూ లేదు అని పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన దిల్జీత్ కన్సర్ట్కు తాను వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. ఒక ఆర్టిస్ట్‌గా, మంచి మనిషిగా ఆయనపై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని, ఈ వివాదానికి అక్కడితో ముగింపు పలుకుదామని దిప్కే పిలుపునిచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

