Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Shashi Tharoor: ఇవాళ ఇందిరా గాంధీ 42వ వర్ధంతి. ఎంపీ శశిథరూర్ తన ఎక్స్ అకౌంట్లో ఓ నివాళి పోస్టు పెట్టారు. మాజీ ప్రధాని ఇందిరను 1975లో ఇంటర్వ్యూ చేసిన ఫోటోను ఆయన షేర్ చేశారు. బంగ్లాదేశ్ వార్ సమయంలో ఇందిర కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 42వ వర్ధంతి ఇవాళ. ఈ నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత , ఎంపీ శశిథరూర్(Shashi Tharoor) తన ఎక్స్ అకౌంట్లో ఓ నివాళి పోస్టు పెట్టారు. 1974లో ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన రోజు ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఆయన షేర్ చేశారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఇందిరను కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1975లో స్విస్ యూత్ మ్యాగ్జిన్ కోసం ఇందిరను తొలిసారి ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపారు. 1977లో ఎన్నికల్లో ఓటమి తర్వాత రెండు సార్లు ఆమెను ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు. విదేశీ విధానం అనే అంశంపై డాక్టరేట్ థీసెస్ కోసం ఇందిరను కలిసినట్లు ఎంపీ థరూర్ పేర్కొన్నారు.
ఎమర్జెన్సీని, ఇందిర అధికార విధానాలను వ్యతిరేకించినా.. 1984లో ఆమె హత్యకు గురికావడంతో తనకు వ్యక్తిగత నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆమె మరణం ప్రజాస్వామ్యానికి తీరని లోటు అని, బ్యాలెట్లతో కాకుండా బుల్లెట్లతో ప్రధాని భవితవ్యాన్ని నిర్ణయించడం శోచనీయమన్నారు. ఇందిర జీవితంలో ఎన్నో మైలురాయి ఘటనలు ఉన్నాయని, కానీ 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం కీలకమైందన్నారు. ఆ సమయంలో ఎంతో ధైర్యంగా నిర్ణయం తీసుకుందని శశిథరూర్ మెచ్చుకున్నారు. ఇందిర సాహసోపత నిర్ణయం వల్ల లక్షలాది మంది విముక్తి పొందారని, ప్రపంచంలోనే అతిపెద్ద వలసలను నివారించారన్నారు. ఆ ఘటన భారత ఉపఖండ పరిస్థితులను మార్చేశాయన్నారు.
Recalling #IndiraGandhi on the 42nd anniversary of her tragic assassination today. I had the honour of meeting her, as President of the @StStephensClg students union, in 1974 and later interviewing her, first in early 1975 for a Swiss youth magazine (see pic), and then twice, at greater length, after her electoral defeat in 1977, for my doctoral dissertation on her foreign policy. Despite my fierce opposition to the Emergency and the occasional authoritarian excesses of her rule, her tragic assassination in 1984 still felt like a profound personal blow. It took something vital away from our democracy that the political fate of our Prime Minister should be determined by bullets and not ballots.
It is difficult to single out one landmark moment in such a consequential life, but I would hail her triumph in the 1971 Bangladesh Liberation War, in which she acted with moral clarity to liberate millions, ended the world’s largest refugee crisis and rewrote the map of the subcontinent. 🙏🏼 प्रणाम and 🕉️ शांति !
— Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

