అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 15 రోజుల క్రితమే మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు నిరీక్షణే మిగిలింది. ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో...
చౌటుప్పల్, అక్టోబర్ 31 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 15 రోజుల క్రితమే మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు నిరీక్షణే మిగిలింది. ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో మార్కెట్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రైతులు మిగతా వ్యవసాయ పనులు వదులుకుని కల్లాల వద్ద ఉంటున్నారు. అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మార్కెట్లో నిల్వ ఉంచిన ధాన్యం రాశుల చుట్టూ నీరు చేరింది. దీంతో ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికే కొనుగోళ్ల కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిసిపోవడంతో నాణ్యత తగ్గి కొనుగోలుకు నిరాకరిస్తారేమోనని భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

