హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) బుధవారం ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందింది. చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేశ్మణి, చీఫ్ కమర్షియల్ అధికారి వెంకటరమణ్ రూ.1.33 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సును అందజేశారు.
ఈ మేరకు బుధవారం శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మాయమాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. ఇటీవల గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ వెబ్సైట్లో ఇచ్చిన 8062 180322 మొబైల్ నెంబర్‌ను భక్తురాలు సంప్రదించగా..అభిమన్యు అనే వ్యక్తి తాను శ్రీనివాసం కాంప్లెక్స్‌లో రిసెప్షన్‌కు చెందిన వాడినని చెప్పి డబ్బులు వసూలు చేశాడు.
త ర్వాత నకిలీ వెబ్సైట్ ద్వారా మోసపోయానని గ్రహించిన భక్తురాలు 1930 క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఎవరైనా టీటీడీ పేరుతో ప్రలోభపెడితే 0877-2263828 ఫోన్ చేయాలని టీటీడీ సూచించింది.