అమరావతి : ఏపీలో జరుగనున్న ఎన్నికల ముందస్తు ఏర్పాట్లకు అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా(Mukesh Kumar Meena) వెల్లడించారు. గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు గాను రాష్ట్రవ్యాప్తంగా 3.3 లక్షల మంది, మరో 2.23 లక్షల మంది పోలీసు(Police) బలగాలతో కలుపుకుని మొత్తం 5. 26 లక్షల మందితో ఎన్నికలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు .
300 కంపెనీల బలగాల్లో ఇప్పటికే 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయని వివరించారు. 175 అసెంబ్లీ స్థానాల్లో ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ సమయంలో మార్పులను ఆయన వివరించారు. అరకు(Araku), పాడేరు(Paderu), రంపచోడవరంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ , పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు.
ఏపీలో 67 వేల మంది సర్వీసు ఓటర్లకు మాత్రమే బైపోస్టు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. వీరంతా వచ్చే నెల 5 నుంచి 10వ తేదీరకు వరకు ఓటింగ్‌కు అవకాశం ఉందని పేర్కొన్నారు. 85 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఫారాలు ఇస్తామని వీరంతా ఈ నెల 22 వరకు హోమ్ ఓటింగ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు.