కట్టంగూర్, ఫిబ్రవరి 25 ; కట్టంగూర్ మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన కమిటీని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞాన ప్రకాష్ రావు సమక్షంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పామనగుండ్ల పంచాయతీ కార్యదర్శి కె. పెద్దయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కట్టంగూరు పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్, కోశాధికారిగా పరడ పంచాయతీ కార్యదర్శి బి.వెంకన్న, గౌరవ అధ్యక్షుడిగా ముత్యాలమ్మగూడెం పంచాయతీ కార్యదర్శి జి. శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బొల్లెపల్లి పంచాయతీ కార్యదర్శి సరస్వతి, ఐటిపాముల పంచాయతీ కార్యదర్శి జి.అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా మల్లారం పంచాయతీ కార్యదర్శి మన్నెం వెంకటేష్, కార్యనిర్వహక కార్యదర్శిగా మునుకుంట్ల పంచాయతీ కార్యదర్శి ముషం భవాని, ప్రచార కార్యదర్శిగా గార్లబాయి గూడెం పంచాయతీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పోర్ట్స్ కార్యదర్శిగా రామచంద్రపురం కార్యదర్శి టి.సాయి కృష్ణ తోపాటు కార్యనిర్వాహక సభ్యులుగా శ్రీకాంత్ రెడ్డి, శ్రీను, యామిని, ప్రసన్న, లింగస్వామి ను ఎన్నుకున్నారు.