ఈ చిత్రంలో కన్పిస్తున్న గుడ్డు కోడి ఆకారంలో ఉంది కదూ. మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గొడుగు మధు ఇంట్లోని కోడి గురువారం ఇలాంటి గుడ్డును పె ట్టింది. విషయం తెలుసుకొన్న స్థానికులు దీన్ని ఆసక్తిగా తిలకించారు. కోళ్లు ఇలాంటి గుడ్లు పెట్టడం చాలా అరుదు అని.. పెంకు పూర్తి స్థాయిలో ఎదగకముందే పెడితే ఇలా జరుగుతుందని పశుసంవర్ధక శాఖ వైద్యులు తెలిపారు.
– దంతాలపల్లి