తాండూర్ : మలేరియా నిర్మూలనకు ( Malaria eradicate ) ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ వో డాక్టర్ సుధాకర్ నాయక్ ( Dr. Sudhakar Nayak ) కోరారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ సబ్ సెంటర్ పరిధిలోని ఎంవీకే త్రీ ఇంక్లైన్ గ్రామంలో మలేరియా నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ మలేరియా దోమల నుంచి వ్యాపిస్తుందని తెలిపారు.
వ్యాధి లక్షణాలు కనపడితే వెంటనే వైద్యులను సంప్రందించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ప్రజలను కోరారు. ప్రజలు మలేరియా బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో 35 మంది ప్రజలకు వైద్య సేవలు అందించారు.
తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు ఝాన్సీరాణి , సర్పంచ్ చందనాల రవికుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్యూవో శ్రీనివాస్, సీహెచ్ వో సత్తయ్య, సూపర్వైజర్లు తార బాయ్, రమాదేవి, పంచాయతీ సెక్రెటరీ కృష్ణ, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.