అల్లాపూర్, మార్చి25 : గాయత్రీనగర్ కాలనీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. గాయత్రీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వీ కృష్ణారావుతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం చంద్ర గార్డెన్స్‌లో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబిహ బేగం ముఖ్య హాజరయ్యారు. చైర్మన్ గా జైని లక్ష్మణ్ గుప్తా, వైస్ చైర్మన్‌గా కాశీనాథ్ చారి, అధ్యక్షుడిగా కృష్ణారావు, ఉపాధ్యక్షుడిగా ప్రేమ్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా వెంకటరమణాచారి, కార్యదర్శిగా విష్ణువర్ధన్ రెడ్డి, కోశాధికారిగా శ్రీలత ప్రమాణస్వీకారం చేశారు. సందర్భంగా నూతన అధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు తీతంగా సమిష్టి నిర్ణయాలతో గాయత్రీనగర్ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.