హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని యూనివర్సిటీల వారీగా బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలని విద్యాశాఖ కోరింది.
ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాసినట్టు తెలిసింది. దీనిని బట్టి ఎక్కువ ఎఫ్డీలు ఉన్న యూనివర్సిటీలకు సర్కార్ ఇచ్చే స్పెషల్ గ్రాంట్లు రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.