చెన్నై : ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో చెన్నైకి చెందిన ఎడ్టెక్ స్టార్టప్ స్కిల్-లింక్ వందలాది ఉద్యోగులను (Layoffs) విధుల నుంచి తొలగించింది. చెన్నై, బెంగళూర్, హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను కన్సాలిడేట్ చేసే క్రమంలో కంపెనీ లేఆఫ్స్‌కు తెగబడింది.
2015 ఏప్రిల్‌లో ఈ ఎడ్టెక్ అప్‌స్కిల్లింగ్ స్టార్టప్‌ను పీ సూర్యనారాయణన్ (సీఈవో), వీ సారంగరాజన్ (సీటీవో) ఏర్పాటు చేశారు. సేల్స్, మార్కెటింగ్, టెక్నాలజీ, టాలెంట్ అక్విజిషన్ విభాగాల్లో ఉద్యోగులపై స్కిల్-లింక్ వేటు వేసింది.
స్ధూల ఆర్ధిక పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని వృద్ధి అంచనాలను కుదించడంతో పాటు భవిష్యత్‌పై దృష్టిసారించే ప్రాజెక్టులను స్లోడౌన్ చేయాలని నిర్ణయించుకున్నామని స్కిల్-లింక్ సహ వ్యవస్ధాపకులు సూర్యనారాయణన్ వెల్లడించారు. పుణే, ఢిల్లీ నుంచి కార్యకలాపాలు సాగించే కార్పొరేట్ టీమ్స్ ద్వారా చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ ఆపరేషన్స్‌ను కన్సాలిడేట్ చేయడం ద్వారా ఉద్యోగుల సంఖ్య కుదించాల్సిన పరిస్ధితి నెలకొందని వివరించారు.
Read More
Anand Mahindra | కృత్రిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..