Anand Mahindra | కృత్రిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
Anand Mahindra | ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT ) టెక్ ప్రపంచంలోకి వచ్చీరాగానే పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో చాట్‌జీపీటీ లాంఛ్ కాగా రోజురోజుకూ దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ కృత్రిమ మేధ వల్ల మానవాళికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్స్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం ఏఐపై తన స్పందన తెలియజేశారు.
Anand Mahindra | ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT ) టెక్ ప్రపంచంలోకి వచ్చీరాగానే పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో చాట్‌జీపీటీ లాంఛ్ కాగా రోజురోజుకూ దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రశ్నలకు, సమస్యలకు ఏఐ చాట్‌బాట్ (AI Chatbot) చిటికెలో పరిష్కారాలను, సమాధానాలను ఇస్తూ యూజర్ల నుంచి మంచి స్పందనను రాబడుతోంది. అయితే ఈ కృత్రిమ మేధ వల్ల మానవాళికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్స్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం ఏఐపై తన స్పందన తెలియజేశారు.
ఈ మేరకు ఏఐ (AI) సృష్టించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి ఐదేండ్ల వయసు నుంచి స్త్రీగా రూపాంతరం చెంది ఆపై 95 ఏండ్ల వృద్ధ మహిళగా ఎలా మారుతుందో ఈ వీడియోలో కండ్లకు కట్టినట్లు చూపించారు. వీడియో షేర్ చేసిన మహీంద్రా ‘ఈ వీడియో ఏఐ సాయంతో జనరేట్ చేయబడింది. ఇందులో ఒక అమ్మాయి ఐదేండ్ల వయసు నుంచి 95 ఏండ్ల వయసు వరకు ఎలా మారుతుందనేది చూడొచ్చు. నేను ఏఐ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే..? అది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోంది’ అంటూ రాసుకొచ్చారు.
Received this post of a sequence of portraits generated by Artificial Intelligence showing a girl ageing from 5years to 95 years. I won’t fear the power of AI so much if it can create something so hauntingly beautiful….and Human… pic.twitter.com/k7d2qupJ52
— anand mahindra (@anandmahindra) April 24, 2023
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన యూజర్లు రకరకాలు కామెంట్లు పెడుతున్నారు. ‘ఇది చాలా అందంగా, విస్మయాన్ని కలిగించేలా ఉంది’, ‘రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది’, ‘చాలా బ్యూటిఫుల్‌గా ఉంది’, ‘ఏఐ కారణంగా ప్రపంచం ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)తో ముప్పు తప్పదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగరిక సమాజ భవిష్యత్తుకు ఉన్న అతిపెద్ద ప్రమాదాల్లో ఏఐ ఒకటని వారు పేర్కొన్నారు. కృత్రిమ మేధ టెక్నాలజీపై నియంత్రణ ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. వీరే కాదు పలువురు వ్యాపారవేత్తలు, నిపుణులు సైతం ఏఐపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
India Corona | భారీగా తగ్గిన కొవిడ్ కేసులు
Indonesia | ఇండోనేసియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

