తెలంగాణకు సముద్రం లేదని
నీరంటే కన్నీరే అని ఎవరన్నారు?
కండ్లు రెండు కాళ్ళకు అతికించి
కొండపోచమ్మకు బోనం తీసుకురా
నీవు చూడలేనంత దూరం
చుట్టు కొలత కొలువలేనంత సముద్రం..!
ఊరు ఊరంతా కలిసి
వన భోజనానికి తరలిరండి
నీళ్లను చూస్తే కడుపు నిండిపోతాది
మళ్లీ మళ్లీ రమ్మనే మల్లన్నసాగర్ ఇదిగో..
రంగరంగ వైభవం తెలంగాణ ఎవుసానికి
రండి మేధావులూ మేడలు వదిలి
రంగనాయకసాగర్ దర్శనానికి..
కాళేశ్వరం కట్టాక సముద్రాల జాతరే జాతర
తెలంగాణ వచ్చాక
కరువును తరిమిన లక్షల క్యూసెక్కుల నీళ్ళే నీళ్ళు..
ఎవరన్నారు సముద్రం లేదని..
తెలంగాణ భూమికింద.. భూమిపైన నీటి సంద్రాలే..!
దాసరి మోహన్
99853 09080