మర్రికి ఉన్న ఊడలు
మనిషికి ఉన్న బంధాలు
నేలరాలినప్పుడు
క్షణికాలు
అయినా ఎందుకో
మానవత్వం
మంట కలుస్తోంది
అనుబంధాలు
అడుగంటుతున్నాయి
ప్రేమ బంధాలు
పతనమవుతున్నాయి
సొంత రక్తంలో
పరాయితనం
ఏరులై ప్రవహిస్తుంటే
దగ్గరైతున్న బంధాలు
చెల్లాచెదురై పోతున్నాయి
సుడిగుండాల వలయంలో
చిక్కుకుని తల్లడిల్లుతున్నాయి
తనయులు తల్లిదండ్రులు
సోదర సోదరీమణులు
ఎవరికివారే వేరు వేరే!