హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూ తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా పున్రెడ్డి వెంకట్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రావులకార్ వెంకటేశ్‌ను ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతామని అబ్దుల్లా, పులి దేవేందర్ ప్రకటించారు.
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ విభాగంలో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 20 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటనలో తెలిపారు. మొత్తం 60 పోస్టుల కోసం 4,665 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,500 మంది పురుషులు, 2,165 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సైబరాబాద్ పోలీసు కమిషరేట్‌లో హాజరుకావాలని కోరారు. ఫిబ్రవరి 3వ లేదా 4వ వారంలో అర్హత సాధించిన వారికి రాతపరీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.