పంజాబ్ రాష్ట్రం యాసంగి, వానకాలాల్లో పండించే వరి, గోధుమలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నది. రబీలో పండించే తెలంగాణ వడ్లను మాత్రం సేకరించబోమని కరాఖండిగా చెప్తున్నది. ఏమిటీ వివక్ష? రాష్ట్రం ఏర్పడిన తర్వాత గణాంకాలను పరిశీలిస్తే కేంద్రం పంజాబ్ నుంచి 1,318.6 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, తెలంగాణ నుంచి కేవలం 555.59 లక్షల టన్నులే సేకరించింది. ఈ రెండు సీజన్లలో ఎక్కువ మొత్తంలో సాగుచేసిన తెలంగాణ కంటే కేవలం ఒకే ఒక సీజన్లో వడ్లు సాగు చేస్తున్న పంజాబ్ నుంచి 763.01 లక్షల టన్నులు సేకరించి తెలంగాణ పట్ల ఉన్న వివక్షను మరోసారి చాటుకున్నది. తెలంగాణలో ఈ రబీ కాలంలో 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయబడి సుమారు 90 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో వడ్లు అందుబాటులోకి వస్తాయి. కేంద్రం వడ్ల సేకరణపై ఎటువంటి హామీ ఇవ్వని నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
హరిత విప్లవం కాలం నుంచి పంజాబ్, హర్యా నా రాష్ర్టాల్లో అదేపనిగా వడ్లు సాగు చేయడంతో భూముల్లో సారం తగ్గిపోయి రైతులకు ఇక వడ్ల సాగు భారంగా మారిందని నిపుణులు అంటున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను వడ్ల సాగు నుంచి ఇతర పంటలకు మార్చాలని సూచిస్తున్నారు. పంజాబ్లో 90 శాతం భూగర్భ జలాలు అధికంగా ఉపయోగించబడినాయి. తెలంగాణలో 10 శాతం నీటి బ్లాకులు మాత్రమే అధికంగా వాడబడ్డాయి. కాబట్టి సుస్థిర వడ్ల ఉత్పత్తికి భవిష్యత్తు చిరునామాగా తెలంగాణ అవుతుంది. తెలంగాణ వడ్లను కొనాల్సిన కేంద్రం పూటకోమాట మారుస్తూ… రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణకు చట్టబద్ధత (ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్) తీసుకురావాల్సిన అవసరం ఆసన్నమైంది.
దేశంలో 9 రాష్ర్టాల్లోనే వడ్లు పండే అనుకూల పరిస్థితులున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఉన్న సాగునీటి వనరులు లేదా ప్రత్యేకంగా వడ్లు పండించుకునేందుకు గాను వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసుకున్నాయి. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో వరి సాగుకున్న అనుకూలత మరే పంటకు ఉండదు. ఎటువంటి నేలలోనైనా వరి పండుతుంది. ఏ పంట కూడా వేయటానికి భూములు అనుకూలం కావని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఉన్న ఏకైక పంట వరి. పెరిగిన సాగునీటి సామర్థ్యంతో తెలంగాణ వంటి రాష్ర్టాల్లో వరి విస్తీర్ణ ఉత్పాదకత, ఉత్పత్తులు పెరిగాయి. కానీ వడ్లను సేకరించాల్సిన కేంద్రం మొండికేస్తున్న ది. రైతులు వరికి బదులుగా వేరే పంటల సాగుకు మళ్లితే దేశ ఆహార అవసరాలను తీర్చేదెవరు?
ప్రపంచంలో అన్నిదేశాలు వరి పండించటానికి సిద్ధంగా లేవన్నది నిజం. ఒక కిలో వడ్ల ఉత్పత్తికి 3 నుంచి 5 వేల లీటర్ల నీరు అవసరం. చాలా దేశాలు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు నీటి విలువ లెక్కిస్తాయి. వడ్ల ఉత్పత్తికి వాడిన నీటికి అయ్యే ఖర్చు ఉత్పత్తి అయిన వడ్ల విలువ కంటే చాలా ఎక్కువ. అందుకే ఎక్కువ దేశాలు సాగు కంటే బియ్యం దిగుమతికే మొగ్గుచూపుతాయి. కానీ, భారతదేశం ద్వీపకల్పం. పుష్కలమైన నీరున్న దేశం. ఇదిలా ఉంటే ఇప్పుడు వరిసాగు రైతు సంస్కృతిలో భాగం. సాగంటే ఉన్న భూమిలో కొంత వరి వేసుకున్న తర్వాత భూమి మిగిలితే, మిగతా పంటల సాగు ఆలోచిస్తారు. విత్తనం, ఎంచుకోవాల్సిన రకం నుంచి అన్ని సాంకేతిక అంశాలతో సహా వరి విషయంలో రైతులకు తెలియనిది లేదు. కాబట్టి వరి రైతుల జీవితం. వరి ఆదాయ వనరు. రైతులు పండించిన ధాన్యం తీసుకోబోమని కేంద్రం అనటం రైతులకు చట్టం ప్రసాదించిన హక్కులను కాలరాయటమే.
దేశంలో ఇప్పటికే ప్రొక్యూర్మెంట్ పాలసీ అమల్లో ఉన్నది. ఈ పాలసీ ప్రకారం.. రైతులు ఎంత మొత్తంలో వడ్లు ఉత్పత్తి చేసినా, ప్రభుత్వం నిర్దేశించిన సమయం, స్పెసిఫికేషన్స్ ప్రకారం ఉం టే కనీస మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేయాలి. రైతు లు పండించిన ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోకుండా, గిట్టుబాటు ధరలు పొందే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే సేకరణ వ్యవస్థ’. 1997-98 నుంచి సేకరణ, సామర్థ్యం పెంచటం, స్థానికంగా రైతులు రవాణా ఖర్చు లు తగ్గించటంతో పాటు, కనీస మద్దతు ధరలు అందేలా ఆహార ధాన్యాల వికేంద్రీకరణ సేకరణ’ పథకం అమలుచేస్తున్నది. వీటి భరోసాతోనే రాష్ర్టా లు, రైతులు వడ్లు సాగు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిషా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవుల నుంచి కేవలం వడ్లు; బీహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్ మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, రాజస్థాన్ నుంచి వడ్లు, గోధుమలు సేకరించబడుతున్నాయి.
కేంద్రం ‘ద ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రి బిజినెస్’ కింద రాష్ర్టాల్లో వ్యవసాయంలో వ్యాపార ధోరణిని ప్రోత్సహించటానికి సంస్కరణలు తీసుకురావాలని చెప్తూనే తాను మాత్రం మారనంటున్నది. శాసనాత్మక అంశాలను తనవద్దే ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తూ రాష్ర్టాలపై భారం మోపుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న తీరును రాష్ట్ర రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఏ పంట కూడా వేయటానికి భూములు అనుకూలం కావని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఉన్న ఏకైక పంట వరి. పెరిగిన సాగునీటి సామర్థ్యంతో తెలంగాణ వంటి రాష్ర్టాల్లో వరి విస్తీర్ణ ఉత్పాదకత, ఉత్పత్తులు పెరిగాయి. కానీ వడ్లను సేకరించాల్సిన కేంద్రం మొండికేస్తున్నది. రైతులు వరికి బదులుగా వేరే పంటల సాగుకు మళ్లితే దేశ ఆహార అవసరాలను తీర్చేదెవరు?
భారతదేశం ద్వీపకల్పం. పుష్కలమైన నీరున్న దేశం. ఇదిలా ఉంటే ఇప్పుడు వరిసాగు రైతు సంస్కృతిలో భాగం.
సాగంటే ఉన్న భూమిలో కొంత వరి వేసుకున్న తర్వాత భూమి మిగిలితే, మిగతా పంటల సాగు ఆలోచిస్తారు. విత్తనం,
ఎంచుకోవల్సిన రకం నుంచి కొంతవరకు అన్ని సాంకేతిక అంశాలతో సహా వరి విషయంలో రైతులకు తెలియని విషయం
కాదు. కాబట్టి వరి రైతుల జీవితం. వరి ఆదాయ వనరు. రైతులు పండించిన ధాన్యం తీసుకోమని కేంద్రం
అనటం రైతులకు చట్టం ప్రసాదించిన హక్కులను కాలరాయటమే.
– కర్షక గీతి, 75690 09336