హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలు 2026 మే 4నుంచి ప్రారంభంకానున్నాయి. మే 4 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంతో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీఈ, బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో 2026- 27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈసారి కూడా ఎప్‌సెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించగా, కన్వీనర్‌గా విజయ్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.