చలికాలంలో సాధారణంగానే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో రకరకాల ఇన్ఫెక్షన్లు దాడిచేస్తాయి. ఇలాంటి సమయంలో అంజీర్ పండ్లు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజూ ఓ రెండుచొప్పున తీసుకుంటే.. మంచి ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. అంజీర్ పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో ఆ పండ్లను తినాలి. ఆ నీటిని కూడా తాగితే.. అందులోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.