బంట్వారం (కోట్పల్లి), అక్టోబర్ 14: మండ ల కేంద్రంలో చేపట్టిన కస్తుర్బా గాంధీ బాలిక ల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బీఆర్ఎ స్ ప్రభుత్వ హయాంలో మండలానికి నూతనంగా కేజీబీవీ పాఠశాల 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం 235 మంది విద్యార్థులతో కొనసాగుతున్నది. ప్రారంభంలో కొన్నాళ్లు అ ద్దె భవనంలో పాఠశాలను కొనసాగించారు. అ క్కడ విద్యార్థులకు అసౌకర్యంగా ఉండడంతో తిరిగి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నారు. నాటి నుంచి అరకొర సౌకర్యాల మధ్య పాఠశాల కొనసాగుతున్నది. ఐ దేండ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.3.50 కోట్లు నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నిర్మాణ పనులు రెండేండ్లుగా కొనసాగుతూ.. ప్రస్తుతం చివరి దశకు చేరుకొన్నాయి. ఇందులో ఆరు తరగతి గదు లు, రెండు ల్యాబొరేటరీలు, రెండు స్టడీ రూ మ్లు, 8 ఇతర డార్మెటరీలతో పాటు ఇతర స్టాఫ్ రూమ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పూర్తిస్థాయిలో ఈ ఏడాది చివరి నాటికి భవ నాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారు.
రక్షణ కరువు
పాఠశాల భవనం పూర్తి చేసినా.. తరగతి గదు లు కొనసాగేంచేందుకు పలు సమస్యలు తలె త్తే అవకాశం ఉంది. భవనం చుట్టూ ప్రహారీ లేదు. బహిరంగ ప్రదేశంలో నిర్మాణ చేపట్టా రు. విద్యార్థుల సౌకర్యార్థం ఇక్కడ ఉండేందు కు అనువుగా ఉండదని వారి తల్లిదండ్రులు అ భిప్రాయ పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని ప్రహారీ నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే నీటి సరఫరా, డ్రైనేజీ నిర్మాణ పనులు ఇంకా చేపట్టలేదు. ఈ పనులు పూర్తి చేసేందుకు మ రో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. పనులన్నీ పూర్తయిన తర్వాత పాఠశాలకు విద్యార్థులను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
స్థలం లేక ఐదేండ్లు జాప్యం
పాఠశాల మంజూరు కాగానే భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. భ వన నిర్మాణానికి సరైన, స్థలం లేక ఐదేండ్లు ని ర్మాణానికి నోచుకోలేదు. మండల కేంద్రం లో స్థలం లేకపోవడంతో కరీంపుర్ సమీపంలో సుమారు ఐదెకరాలు కేటాయించేలా అప్పటి కెమ్మెల్యే ఆనంద్ ప్రత్యేక చొ రవ తీసుకొన్నారు. రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించడంతో సమస్య తీరిపోయి, భవన నిర్మాణానికి అనుకూలంగా మారింది. అన్ని పనులు పూర్తి చేయించి వచ్చే విద్యా సంవత్సరంలో ఈ భవనంలో పాఠశాలను కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సుందరి అనిల్,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు