ఇంఫాల్: మణిపూర్, మయన్మార్ సరిహద్దులోని మోరే పట్టణంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 43 అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో రూ.500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్టు తెంగ్నౌపాల్ జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ సింగ్ వెల్లడించారు. మయన్మార్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 54 కిలోల బ్రౌన్ షుగర్, 154 కిలోల మెథాం పెటామిస్ ఉన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.