న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాదైంది. ఆ మారణహోమం మిగిల్చిన విషాదం 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఉగ్ర ఘటనకు సంబంధించి మరో కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు స్థానికుల దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు వారు ఆశ్రయం కల్పించారని, అవకాశం ఉన్నా.. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఉంచారని విచారణలో వెల్లడైంది.
ఇందుకోసం వారు రూ.3 వేలు తీసుకున్నట్టు ఎన్ఐఏ విచారణలో తేలింది. స్థానికులు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులు ఆశ్రయం పొందారు. ఆ సమయంలో వారి వద్ద ఆయుధాలు కనిపించాయి. లష్కరే తాయిబా అగ్ర కమాండర్, ప్రధాన నిందితుడు అలీభాయ్ గురించి మాట్లాడుకున్నారు.