పోలీసు అధికారికి బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు
తన ఎస్‌యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో పేడతో ఇంటిని నింపివేస్తానని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధిపై మధ్యప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది.
- మధ్యప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం అభ్యంతరం
శివ్‌పురి : తన ఎస్‌యూవీతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచి రోడ్డు ప్రమాదానికి కారకుడైన తన కుమారుడిని పోలీసు స్టేషన్‌కు పిలిచి ప్రశ్నించినందుకు సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఆయుష్ జాకఢ్ని 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో పేడతో ఇంటిని నింపివేస్తానని బెదిరించిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ లోధిపై మధ్యప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. పిఛోర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటిసారి ఎమ్మెల్యే లోధి ఉపయోగించిన అమర్యాదకర, బెదిరింపు భాషపై ఐపీఎస్ అధికారుల సంఘం అభ్యంతరం తెలిపింది.
ఎమ్మెల్యేపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. ఏప్రిల్ 16న జరిగిన రోడ్డు ప్రమాదంతో వివాదం రేకెత్తింది. లోధి కుమారుడు దినేశ్ లోధి తన థార్ జీపుతో ఐదుగురు వ్యక్తులను గాయపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

