Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Mirzapur: The Movie | భారతీయ ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'మీర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై సంచలనాలు సృష్టించిన తర్వాత డిజిటల్ మాధ్యమంలోకి వచ్చేసింది.
Mirzapur: The Movie | భారతీయ ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మోస్ట్ పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై సంచలనాలు సృష్టించిన తర్వాత డిజిటల్ మాధ్యమంలోకి వచ్చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ‘మీర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అధికారికంగా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన లేదా మళ్లీ చూడాలనుకునే అభిమానుల కోసం మేకర్స్ ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ఇచ్చారు. థియేట్రికల్ కట్ తో పోలిస్తే మరింత అదనపు ఫుటేజ్‌తో కూడిన ఎక్స్టెండెడ్ కట్ (Extended Cut) వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేశారు. దీని మొత్తం నిడివి 3 గంటల 31 నిమిషాలు ఉండటం విశేషం.
ఈ చిత్రంలో ‘కాలీన్ భయ్యా’గా పంకజ్ త్రిపాఠి, ‘గుడ్డు పండిట్’గా అలీ ఫజల్, ‘మున్నా భయ్యా’గా దివ్యేందు శర్మ తమ నటనతో మరోసారి అదరగొట్టారు. వీరితో పాటు రవి కిషన్, శ్వేతా త్రిపాఠి, రసికా దుగల్, అభిషేక్ బెనర్జీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీకెండ్లో మీర్జాపూర్ గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌ను మీ ఇంట్లోనే ఎంజాయ్ చేసేయండి!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTTReleases | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
ACB Raid | చేయూత పింఛన్ కోసం లంచం డిమాండ్.. రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
మరణంలోనూ వీడని మూడుముళ్ల బంధం
Raju Weds Rambai | ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు ఏడాది.. దర్శక నిర్మాత వేణు ఊడుగుల ఎమోషనల్!
Agri Gold Case | అగ్రిగోల్డ్ బాధితులకు బాండ్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ సీఐడీ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

